‘నాని’న్నుకోరి’ నిర్మాతలకు పండగే..!

261
Telugu film Ninnu Kori grosses Rs 25 cr at world box office on opening ...
- Advertisement -

ఒక్కో సినిమాతో దర్శక నిర్మాతలకి తనపై గల నమ్మకాన్ని .. తన సక్సెస్ రేటును పెంచుకుంటూ వెళుతున్నాడు నాని. తాజాగా న్యాచురల్ స్టార్ నాని, మళయాళం బ్యూటీ నివేదా థామస్ జంటగా నటించిన సినిమా ‘నిన్నుకోరి’. ఇక ఈ సినిమా కూడా ఇదే విషయాన్ని మరోమారు నిరూపించింది.

Telugu film Ninnu Kori grosses Rs 25 cr at world box office on opening ...

అంతేకాకుండా కలెక్షన్స్‌లో దూసుకుపోతూ.. నాని కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ సినిమాకు మంచి క్రేజ్ లభించడంతో వరల్డ్ వైడ్‌గా నిన్ను కోరి సినిమా మొత్తం రూ. 25 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కోసం వెచ్చించిన బడ్జెట్ కన్నా ఎక్కువ లాభాలు సాధించిన సినిమా ఇది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Telugu film Ninnu Kori grosses Rs 25 cr at world box office on opening ...

శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ నివేదా థామస్‌కి నాని లవర్‌గా నటించగా… వీళ్ల లవ్ సంగతి తెలియక నివేదాని పెళ్లి చేసుకున్న యువకుడి పాత్రలో ఆది పినిశెట్టి కనిపించాడు.

ఆ తర్వాత ఈ ముగ్గురి జీవితంలో ఎదురైన ఘటనల పరిణామాల క్రమమే నిన్ను కోరి సినిమా కథాంశం. గోపీ సుందర్ మ్యూజిక్ కూడా ఆడియెన్స్‌ని కట్టిపడేసింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను కోన వెంకట్ ప్రజెంట్ చేశాడు. ఇక ఫుల్ రన్లో ఈ సినిమా 35 కోట్ల షేర్ ను సాధించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -