విజయ్‌కి అండగా ఉంటాం:రాహుల్

1
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ…నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారి కాంగ్రెస్‌కు కొత్త మిత్రుడిగా మారిన విజయ్‌కు తన మద్దతును ప్రకటించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు జోసెఫ్ విజయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని, మీ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. తమిళ ప్రజల హక్కులు, గౌరవం మరియు ఆకాంక్షలను రక్షించడంలో, రాష్ట్ర ప్రగతి కోసం కలిసి పనిచేయడంలో నేను మీకు తోడుగా ఉంటాను అని రాహుల్ గాంధీ ‘X’ లో పోస్ట్ చేశారు.

దీనికి విజయ్ స్పందిస్తూ.. మీ ఆత్మీయ శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు గౌరవనీయులైన ప్రతిపక్ష నేత అని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే (DMK) అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గత వారం రాహుల్ గాంధీ పుట్టినరోజున స్టాలిన్ శుభాకాంక్షలు తెలపగా, రాహుల్ ఇచ్చిన సమాధానం కాంగ్రెస్-డీఎంకే సుదీర్ఘ బంధానికి గండికొట్టి, కాంగ్రెస్-విజయ్ కొత్త కూటమి ఏర్పడిన నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై పలు అంచనాలకు దారితీసింది.

ఎన్నికల తర్వాత డీఎంకేతో కాకుండా అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. స్టాలిన్ కుమారుడు, రాజకీయ వారసుడు అయిన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని ఆరోపించారు. డీఎంకే అధికారిక పత్రిక ‘మురసోలి’లో.. కాంగ్రెస్ జాతీయ ఎన్నికల సమయంలో మిత్రపక్షాల మద్దతు కోరుతుంది కానీ రాష్ట్ర ఎన్నికల సమయంలో వారిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది అని విమర్శించారు.

Also Read:కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్!

- Advertisement -