వెయిట్ లాస్‌ సీక్రెట్ ఇదే!

6
- Advertisement -

‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్‌ వ్యాధి కారణంగా సినిమాలకు రెండేళ్ల పాటు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తాను బరువు తగ్గడంపై పదేపదే వస్తున్న ప్రశ్నల గురించి స్పందించారు. ఈ పరిస్థితులన్నింటికీ తన పెంపుడు పిల్లి ‘జెలాటో’తో ఉన్న ఓ ఆశ్చర్యకరమైన సంబంధాన్ని కూడా ఆమె వెల్లడించారు.

తాను బ్రేక్ తీసుకున్న ఆ రెండేళ్ళలో ఆహారం నాకు ఒక ట్రిగ్గర్‌గా మారింది. నా జీర్ణవ్యవ’మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్‌ వ్యాధి కారణంగా సినిమాలకు రెండేళ్ల పాటు తీసుకున్న స్థకు పడనిది ఏది తిన్నా..అది నా ఆటో ఇమ్యూన్ కండిషన్‌ను ప్రేరేపించేది. దాంతో నా ఆహారం చాలా పరిమితంగా, చప్పగా మారిపోయింది. ఆ రెండేళ్ల పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంగా ఒకే విధమైన ఆహారాన్ని తినేదాన్ని. ఆ తర్వాత నా డైట్‌లో చేర్చుకోవడానికి వైద్యులు అనుమతించిన మొదటి పదార్థం చక్కెర, డైరీ ప్రొడక్ట్స్ లేని ‘జెలాటో’ (ఒక రకమైన ఐస్ క్రీమ్). కాబట్టి నేను ఆ జెలాటో తినడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేదాన్ని… అందుకే , ఒక పిల్లిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి ‘జెలాటో’ అని పేరు పెట్టాను అని చెప్పుకొచ్చారు.

తాను ఇప్పుడు ‘సౌకర్యవంతంగా’ తినగలుగుతున్నానని కానీ ‘అతిగా’ తినలేనని సమంత వెల్లడించారు. తన బరువు తగ్గడంపై నిరంతరం వస్తున్న ప్రశ్నలు, వదంతుల గురించి ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సౌకర్యవంతంగా తినగలిగే మంచి స్థితిలో ఉన్నాను. అతిగా కాదు కానీ తినగలను. నన్ను ఎప్పుడూ ‘ఎందుకంత బరువు తగ్గావు?’ అని అడుగుతుంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఎదుటివారికి నిజంగా తెలియదు. నాకు తినాలని లేక కాదు, నేను తినలేను అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:అమెరికా-ఇరాన్..చారిత్రాత్మక శాంతి ఒప్పందం

2021లో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత 2022లో తన చిత్రం ‘యశోద’ ప్రమోషన్ల సమయంలో తాను ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియాలో వెల్లడించారు.

- Advertisement -