అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై దుమారం!

2
- Advertisement -

దేశంలో ప్రస్తుతం మత రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ వివాదానికి తెరలేపాయి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గనుక నేడు బతికుంటే బీజేపీని నిషేధించేవారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ.. కాంగ్రెస్‌కు హిందువులన్నా, హిందూత్వ అన్నా ద్వేషమని వారు కేవలం ముస్లింలకే కొమ్ముకాస్తున్నారని మండిపడింది.

జైపూర్‌లో జరిగిన ఒక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఉన్న వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉందని…తన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇందిరా గాంధీ వంటి బలమైన నాయకురాలు ఈ రోజు బతికుంటే….ఆమె బీజేపీ లాంటి పార్టీని నిషేధించేవారు. నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను….నేటి వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశం ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్తులో ఈ దేశ ప్రజలే దీని పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది అని హెచ్చరించారు.

గెహ్లాట్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్‌కు హిందువులపై, హిందూత్వంపై ఉన్న ద్వేషాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి హిందువులన్నా, హిందూత్వ అన్నా ద్వేషం. దానికి మరో నిదర్శనమే అశోక్ గెహ్లాట్ చేసిన ఈ ప్రకటన. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హిందూత్వం అనేది ఒక జీవన విధానం. దానిని ఆమె ఎందుకు నిషేధిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

Also Read:టీఎంసీ రెబల్స్…NCPIలో విలీనం!

- Advertisement -