టీఎంసీ రెబల్స్…NCPIలో విలీనం!

1
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన 20 మంది తిరుగుబాటు (రెబల్) ఎంపీలు ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) లో విలీనమయ్యారు. పార్లమెంట్‌లో తమకు ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు తీవ్రరూపం దాల్చిన తరుణంలో త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చిన్న ప్రాంతీయ పార్టీ ఒక్కసారిగా జాతీయస్థాయిలో వెలుగులోకి వచ్చింది.

‘ఎన్‌సీపీఐ’ పార్టీ 2023లో ఏర్పాటయింది. దీనికి ప్రధానంగా త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉనికి ఉన్నప్పటికీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం మాత్రం చాలా స్వల్పం. 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది. అయితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది రెబల్ ఎంపీలు ఈ పార్టీలో విలీనమవుతున్నట్లు ప్రకటించడమే కాకుండా పార్లమెంట్‌లో తమకు ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు.

దీంతో త్రిపురలోని కొన్ని నియోజకవర్గాలకు, బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) ఒక్కసారిగా జాతీయ దృష్టిని ఆకర్షించింది. మేము ఎన్‌సీపీఐ (NCPI) పార్టీలో విలీనమయ్యాము. రాబోయే రోజుల్లో మా తదుపరి వ్యూహాన్ని నిర్ణయించుకుంటాం అని స్పీకర్‌తో భేటీ అనంతరం రెబల్ టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ వి చెప్పారు.

Also Read:ఎన్నారై కాదు..మార్గదర్శి!

త్రిపురలో శంతను సాహా ఈ పార్టీ కార్యకలాపాలను చూస్తుండగా కోల్‌కతా నుండి తరుణ్ కుమార్ రాయ్ దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పార్టీ ఇప్పటివరకు కేవలం 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది.

- Advertisement -