ఫ్రాన్స్ — భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సద్భావనను, పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్…భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జి7 (G7) సదస్సు సందర్భంగా ఆదివారం పంచుకున్న ఈ వైరల్ ఫోటోలో, ఇద్దరు నేతలూ మధ్యధరా సముద్ర తీరప్రాంతం నేపథ్యంలో ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు. అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నది మాత్రం మాక్రాన్ పెట్టిన ఒకే ఒక్క క్యాప్షన్: “Nice!”.
ఈ క్యాప్షన్ ఇరు నేతల భేటీ పట్ల ఆయనకున్న సంతోషాన్ని వ్యక్తపరచడంతో పాటు ఈ ఏడాది హై-లెవెల్ జి7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఫ్రెంచ్ రివియెరాలోని అందమైన నగరం ‘నిస్’ (Nice) పేరును కూడా ఇందులో స్ఫురించేలా రాయడం విశేషం.అలాగే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన ఒక వీడియో రీల్‌ను కూడా పంచుకున్నారు మాక్రాన్. అందులో భారతీయ పాప్ సంస్కృతికి అద్దం పడుతూ ప్రముఖ భారతీయ బ్యాండ్ ‘ధురంధర్’ పాడిన ఆరి ఆరి అనే హిట్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఉపయోగించారు. ఈ ఊహించని మ్యూజికల్ టచ్ సోషల్ మీడియాలో విపరీతమైన లైక్‌లు, కామెంట్‌లతో దూసుకుపోతోంది. ఇద్దరు ప్రపంచ దేశాల అధినేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని, సరదా దౌత్యాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
Also Read:ఎన్నారై కాదు..మార్గదర్శి!

