1993 తర్వాత స్లోవేకియాలో భారత ప్రధాని!

2
- Advertisement -

ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం స్లోవేకియా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని,ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికోలతో భేటీ కానున్నారు. న్యూఢిల్లీ – బ్రాటిస్లావా మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశం.

తన రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్నారు. దీంతో 1993లో స్లోవేకియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి భారతీయ ప్రధాన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు.

ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, తన సహచర ప్రధాని రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఈ చర్చలు న్యూఢిల్లీ – బ్రాటిస్లావా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గం సుగమం చేస్తాయని పేర్కొన్నారు.
అధ్యక్షుడు పెల్లెగ్రిని, ప్రధాన మంత్రి ఫికోలతో జరగబోయే ఫలప్రదమైన సమావేశాల కోసం ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చారు.

ప్రధాని మోదీ అక్కడకు చేరుకోగానే, స్లోవేకియా సంస్కృతిలో గౌరవానికి, ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచే ‘రొట్టె, ఉప్పు’ ఇచ్చి ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ప్రజల సంబంధాలకు అద్దం పడుతూ, ప్రధానికి స్వాగతం పలకడానికి అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Also Read:ఎన్నారై కాదు..మార్గదర్శి!

స్లోవేకియా పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ తన యూరప్ పర్యటనలో చివరి దశగా తిరిగి ఫ్రాన్స్ చేరుకుంటారు. జూన్ 16 నుండి 17 వరకు ‘ఎవియాన్’ నగరంలో జరిగే జి7 (G7) సదస్సులో ఆయన పాల్గొంటారు.

- Advertisement -