మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కుట్రలే కారణం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీనాక్షి నటరాజన్ ఓటమికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే. .కాంగ్రెస్ పార్టీ నేతలు—వీరెవరు పార్టీకి ద్రోహం చేశారో వాళ్లే తెలుసుకోవాలి. ఆమెపై ఉన్న కేసు వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారో విచారణ జరుపుకోవాలి. పదే పదే సిట్ అనే ముఖ్యమంత్రి, ఈ అంశం పైన కూడా సిట్ వేసుకోవచ్చు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘బ్లాక్ షీప్’ (పార్టీ ద్రోహులు) ఎవరో కనుక్కోవాలి.కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు అన్నారు.
అలాంటి కాంగ్రెస్ కంపులో, ద్రోహాల పార్టీ అంశంలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారు. మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసు. ముమ్మాటికీ ఆయన చేసిన పనినే ఇది. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసుకొని, అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో తెలుసుకోవాలి.కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ గారు చెప్పినందుకు అభినందనలు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారు. అసలు గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే కదా! ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్న… పదవి కొనుక్కున్న వ్యక్తే కదా! రేవంత్ రెడ్డి పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలుసు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుంది. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసు. కాబట్టి, షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవం అన్నారు.
మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అంటారు..రేవంత్ రెడ్డి హిట్లర్ గురించి మాత్రమే మాట్లాడలేదు. “హిట్లర్ అంతకముఠా నాకు ఆదర్శం” అన్నారు. అంతకుమించి, ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌లో గాజా మాదిరి విద్వంసం సృష్టించిన అన్నారు. యుద్ధంలో జరిగిన విద్వంసం గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఎంత మానసిక రుగ్మత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మానసిక రోగి అయితేనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి చెప్పిన శిథిలాల కిందనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతిపెడతారు.
హైడ్రా అనేది లేనే లేదు, కానీ రేవంత్ రెడ్డి అజ్ఞానంతో “హిట్లర్ హైడ్రా తనకు ఆదర్శం” అంటూ మాట్లాడిండు. గోబెల్స్ ప్రచారానికి మించి రేవంత్ రెడ్డి చేసుకుంటున్నారు. శ్రీధర్ బాబు హిట్లర్ వ్యాఖ్యలను సమర్ధించడం పట్ల జాలి కలుగుతుంది..రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు సమర్థించడం ఆయనకున్న ఇబ్బందులను గుర్తుచేస్తుంది. శ్రీధర్ బాబు చదువుకున్న వ్యక్తి. అలాంటి ఆయన హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణం. శ్రీధర్ బాబు పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది. శ్రీధర్ బాబు లాంటి నాయకుడు కూడా హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నాం అన్నారు.
75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నగరానికి చేసింది ఏమీ లేదు. గత 10 సంవత్సరాలలో మేము చేసిన ఎస్ఎన్డీపీ (SNDP) మరియు ఇతర కార్యక్రమాల వల్లనే కాస్తంత మెరుగైన పరిస్థితి ఉంది. కానీ, రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు. వర్షాకాల సన్నద్ధత ప్రణాళిక పైన సమీక్ష కూడా నిర్వహించలేదు. మేము వేసిన ఫ్లైఓవర్లు, ఎస్ఎన్డీపీ నిర్వహణ కూడా చేయడం లేదు. ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ ప్రజలే ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటారు.
వర్షాలు ఆగితే తన క్రెడిట్ అని చెప్పుకున్న ముఖ్యమంత్రి, వర్షాలు, వరదలు వస్తే మాత్రం పాత ప్రభుత్వానికి అంటగడుతున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి రోడ్ల కింద బావులు తవ్వి వర్షాలను, వరదలను ఆపుకున్నానని చెప్పాడు. హైదరాబాద్ నగరంలోని వర్షాలకు ప్రజల అవస్థ పాపం ముమ్మాటికీ రేవంత్ రెడ్డిదే. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లనే ఆ ప్రాంతంలో రద్దీ భారీగా పెరిగింది. ఎయిర్పోర్ట్ 18 నెలల్లో మెట్రో పూర్తి అయ్యేది; లక్షల మందికి లాభం జరిగేది, ట్రాఫిక్ జామ్‌లు తగ్గేయి. ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) లేకుండా సులభంగా పూర్తయ్యే మెట్రోను రేవంత్ రెడ్డి ఆపేశాడు. మెట్రో ఎల్ అండ్ టీ (L&T) సీఎఫ్ఓ (CFO)ను బెదిరించి మెట్రోను లాక్కున్నాడు. మేము గతంలో మెట్రోను పూర్తి చేసాము, కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటో చెప్పాలి. రేవంత్ రెడ్డి రెండు చెరువులు కట్టి ప్రచారం చేసుకుంటున్నాడు. మేము 100 చెరువులు బాగు చేసిన తర్వాత ఏనాడూ ఫోజులు కొట్టలేదు.
హైడ్రా అనేది ఒక బ్లాక్మెయిల్ సంస్థగా మారింది. హైడ్రాను అన్ని సమస్యలకు జిందా తిలస్మాత్ లెక్క చూపిస్తున్నారు. పూడికతీత, వరద, చెరువుల నిర్వహణ—ఇలా అన్నింటికీ హైడ్రా పేరే చెప్తున్నారు. కానీ హైడ్రా బ్లాక్‌మెయిలింగ్, డబ్బుల వసూళ్లకు తప్పించి ఇంకేమీ పని చేయడం లేదు. నిజంగానే హైడ్రా ద్వారా లక్ష ఎకరాలు రక్షించి ఉంటే, వాటిని అమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. సభ్యత్వ నమోదు మొబైల్ అప్లికేషన్ సిద్ధంగా ఉన్నది. అప్లికేషన్ టెస్టింగ్ కొనసాగుతున్నది. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సభ్యత్వ నమోదు పైన శిక్షణ ఉంటుంది. నియోజకవర్గాల వారీగా ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే జనరల్ సెక్రటరీలు, ఇన్చార్జీలు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారు. 60 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (SIR) మరియు మెంబర్షిప్ పైన సమావేశాలు పూర్తి అయ్యాయి.
సభ్యత్వ నమోదు ఈ నెలాఖరు వరకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము. ఆ తర్వాత కమిటీలకు, కార్యకర్తలకు శిక్షణ నిర్వహిస్తాము. సభ్యత్వ నమోదులో రాసి కన్నా వాసి ముఖ్యం అనుకుంటున్నాము. ప్రతి ఒక్క కార్యకర్తను సుశిక్షితులైన పార్టీ కార్యకర్తల మాదిరిగా తయారు చేసుకుంటాము. లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీ నిర్మాణం మాకున్నది. గ్రామగ్రామాన బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది.
రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్దే విజయం. భారీ మెజారిటీతో ఎన్నికలు గెలుస్తాం; ఇప్పటికే పలు సర్వేలు ఇదే మాట చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూడో స్థానంలోనే ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలు, హామీల పైన మోసమే వారిని మూడో స్థానానికి నెట్టింది. కాంగ్రెస్ పార్టీ జారుడు బల్ల పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా కిందికి దిగజారిపోతూనే ఉంటుంది కానీ పైకి రాదు.వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేశాము. ఒంటరి పోరాటం మాకు కలిసి వచ్చింది. ప్రతిసారి ప్రజలు ఆశీర్వదించారు. మొన్నటి ఎన్నికల్లోనూ అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు రోజుకీ దిగజారుతున్నది అన్నారు.
గత పాలనలో ప్రజలకు మా పైన కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నది. ప్రజలు సూచించిన లోపాలను సరిచేసుకొని ముందుకు పోతున్నాం. ఆత్మపరిశీలన చేసుకున్నాము. పార్టీ నాయకత్వం నుంచి కింది కార్యకర్త వరకు ప్రతి ఒక్కరము ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు పోతున్నాము. గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి.జూలై నెల నుంచి డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నది అంటున్నారు. ఎవరు ఎక్కడ, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో ఎవరికీ తెలియదు. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ జరగకున్నా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సి ఉంది. కనీసం ఇక్కడైనా డీలిమిటేషన్ జరుగుతుంది అన్న సమాచారం నాకు ఉన్నది. జమిలి ఎన్నికలు ఉండకపోవచ్చు.హైదరాబాద్‌లో పార్లమెంట్ స్థానాలు పెంచాలన్న అంశం పైన ఇప్పటిదాకా సమాచారం లేదు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఏ ప్రతిపాదన పైన అయినా పార్టీ తన అభిప్రాయం చెప్తుంది. ఇప్పుడు ఉన్న దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ కి మద్దతు ఇస్తాం. దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గితే ఊరుకోము. ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గితే దేశంలో అస్థిరతకు దారితీసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా కేంద్రం చూసుకోవాలి. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రజలతో కలిసి గొంతు విప్పుతాం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భారీగా అమ్ముతున్న భూముల నుంచి వచ్చే నిధులు ఎక్కడ పోతున్నాయో చెప్పాలి. 4 లక్షల} కోట్ల రూపాయల అప్పు తీసుకువచ్చి వాటిని ఎక్కడ పంపిందో చెప్పాలి. ఒకవైపు ఫీజ్ రీయింబర్స్మెంట్ పక్కన పెట్టింది; కొత్తగా పెన్షన్లు, హామీలు అమలు చేయడం లేదు. కానీ కొత్త హెలికాప్టర్లు కొని సీఎం సోకులు పడుతున్నాడు. సీఎం 200{ కోట్ల} రూపాయలతో రాజసౌధాలు కట్టుకుంటున్నాడు. భారీ ఎత్తున కోటగోడలు కట్టి ఒక రాజప్రసాదం నిర్మాణం చేసుకున్నాడు. సీఎం రాజప్రసాదానికి సంబంధించిన నిర్మాణ జీవోలు అన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారు. తప్పు చేయకుంటే ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో చెప్పాలి.
అర్ధరాత్రి సీఎం ఇంటి గృహప్రవేశం ఎందుకు చేసుకున్నారో చెప్పాలి. నిజంగానే అందులో తప్పు చేయకుంటే, రహస్యం లేకుంటే మీడియాను తీసుకువెళ్లి చూపించాలి. గతంలో ప్రగతి భవన్ పైన “బంగారు కిటికీలు” అంటూ, “బాత్రూమ్లు” అంటూ దుష్ప్రచారం చేశారు.ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి తీసుకొచ్చి సాధించింది ఏమీ లేదు కానీ మూడు మూడు ఇండ్లు కట్టుకుంటున్నారు. డెప్యూటీ సీఎం సైతం హైదరాబాద్, ఖమ్మం, మధిరలో భారీ ఇండ్లు కట్టుకుంటున్నారు. నిజంగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిన ఇల్లు లేకుంటే, ఇల్లు ఉండడం లేకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం ఎందుకు వాడుతున్నాడు? ,లక్ష కోట్ల రూపాయల భూములు అమ్మి వాటిని ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. ప్రతి ఇంటికి 2.5\text{ లక్షల} రూపాయలు ఇస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని చెప్పారు, మరి అలాంటి కుటుంబం ఒకటైనా ఉన్నదా రాష్ట్రంలో? ,యువతలో నిరాశా నిస్పృహలు ఉంటే యువతలో తిరుగుబాటు తప్పదని గతంలో చెప్పాము. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఆన్లైన్లో అదే స్పందన కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో ఏం చేస్తుందో ఇంకా క్లారిటీ లేదు అన్నారు.
Also Read:మీనాక్షి ఎపిసోడ్..పూర్తి వివరాలివే
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింది.మా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటి నిర్మాణాలు పూర్తయి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింది; ఇప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఎవరిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి రెండు మూడు సంవత్సరాల తర్వాత జరిగే రిజిస్ట్రేషన్ల రూపంలో తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోవడంతోనే లక్షల మంది ఉపాధికి తీవ్రమైన గండి కొట్టింది.
నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశానికి చేసింది ఏమీ లేదు. 12 సంవత్సరాల కాలంలో ఒక్క హామీని కూడా నిలుపుకోలేదు. అది అందరికీ ఇల్లు కావచ్చు, ఇంటింటికీ నీళ్లు అయినా కావచ్చు, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, రైతన్నల ఆదాయం రెట్టింపు వంటి ప్రతి అంశంలోనూ ప్రభుత్వం విఫలమైంది; నరేంద్ర మోడీ విఫలమయ్యారు. 12 సంవత్సరాల్లో సాధించింది ఏమీ లేదు. దేశంలో ప్రజల మధ్య విద్వేషం నింపడం, మత రాజకీయాలు తప్ప మోడీ చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి 12 ఏళ్ల బీజేపీ పాలనలో దక్కింది శూన్యం.గతంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా సమావేశమై తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన మహారాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం రూపంలో ససేమిరా అన్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకోరనే విషయం తెలిసిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు అడ్డగోలుగా సంపాదించిన అక్రమ సంపాదనతో ఎన్నికల్లో ఓట్లు కొని గెలుద్దాం అనుకుంటున్నారు అన్నారు.
కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ కోసం నిలబడింది కేసీఆర్ గారు మాత్రమే. ఆయన సభ పెట్టిన తర్వాతనే కేఆర్ఎంబీ (KRMB) కి రాసిన లేఖను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నీళ్ల విషయంలో బీజేపీ రాసిన స్క్రిప్ట్‌నే కాంగ్రెస్ చదువుతుంది. నీళ్ల నష్టాన్ని తాజాగా ఎండగట్టింది కూడా మా ప్రభుత్వమే, మా పార్టీనే.సింగరేణి అంశంలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది సింగరేణి వ్యవహారాలు నడిపిస్తున్నాడు. సైట్ విజిటేషన్ మొదలుకొని నైనీ గనుల వరకు అనేక అక్రమాలు జరిగాయి. అక్రమాలు జరగకుంటే వాటి టెండర్లను ఎందుకు రద్దు చేశారో చెప్పాలి. చివరికి బొగ్గు తవ్వకుండా తవ్వినట్లు చూపించి అడ్డగోలుగా వందల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. గతంలో సింగరేణి కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశాము. ఉద్యోగాల నుంచి మొదలుకొని అనేక అంశాల్లో మనవియా దృక్పథంతో వ్యవహరించాము.ఇప్పుడు కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల కోసం మాట్లాడే ముందు అందులో కేంద్రానికి వాటా ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకురావాలి. కేవలం మాటలు చెప్తే సరిపోదు. సింగరేణి అక్రమాలపై ఇప్పటికే పలు లేఖలు రాసిన వాటిపైన సమాధానం చెప్పే ధైర్యం లేకనే మౌనం వహిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంతో కిషన్ రెడ్డి కుమ్మకు అయ్యారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామని గత ప్రభుత్వంలోని నిర్ణయం తీసుకుందాము. ఎన్నికల వలన దాని అమలు ఆలస్యమైంది. 100 రోజుల్లో వారి సమస్యలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికి అడుగడుగున ద్రోహం చేస్తున్నది. ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నది. ఈ అంశం లో కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సమాధానం చెప్పాలి. ఆర్టీసీ కార్మికుల పక్షాన మా పార్టీ నిలబడి కొట్లాడుతుంది అన్నారు.

