హెచ్-1బి వీసా దారులకు గుడ్‌న్యూస్

10
- Advertisement -

అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు అక్కడి కంపెనీలకు మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు భారీ ఉపశమనం కలిగించింది. హెచ్-1బి (H-1B) వీసాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన $100,000 (సుమారు రూ. 83 లక్షలు) భారీ రుసుమును కోర్టు కొట్టేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) స్వాగతించింది. ఈ తీర్పుతో ఉపాధి ఆధారిత వలస విధానంలో మళ్లీ పారదర్శకత, నిలకడ వస్తాయని పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 సెప్టెంబర్‌లో ఒక ప్రకటన ద్వారా ఈ భారీ రుసుమును ప్రతిపాదించారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వాదించింది. అయితే, యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి రిచర్డ్ స్టియర్న్స్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని (Separation of Powers) ఈ నిర్ణయం ఉల్లంఘిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పెద్ద పెద్ద విధానపరమైన మార్పులు చేసేటప్పుడు ఆర్థిక వాస్తవాలను, చట్టపరమైన పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

ఫిడ్స్ పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కండ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… కోర్టు నిర్ణయం అత్యంత సమంజసమైనది. అమెరికాలో ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతిక రంగాల అభివృద్ధికి అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన నిపుణులు చాలా అవసరం. ముఖ్యంగా టెక్నాలజీ, హెల్త్‌కేర్, అధునాతన ఉత్పాదక రంగాల వృద్ధికి ఈ తీర్పు ఎంతో దోహదపడుతుంది అని అన్నారు. మెరిట్ ఆధారిత వలస విధానం అమెరికన్ వ్యాపారాలను, అలాగే అక్కడి ఆర్థిక వ్యవస్థను మరింత బలోభతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక?

ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు, వారిని నియమించుకునే యూఎస్ కంపెనీలకు భారీ ఆర్థిక భారం తప్పినట్లయింది.

- Advertisement -