ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక?

3
- Advertisement -

లెజెండరీ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌ కు సంబంధించి ఒక సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ఐకానిక్ సింగర్ పాత్రను పోషించడానికి నటి రష్మిక మందన్న ఎంపికైనట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

ఈ బయోపిక్‌లో రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించనుందని సమాచారం. ఇటీవలే రష్మిక నివాసంలో ఈ పాత్రకు సంబంధించిన ‘లుక్ టెస్ట్’ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇంతకుముందు ఈ చిత్రంలో సాయి పల్లవి స్థానంలో రుక్మిణి వసంత్ లీడ్ రోల్‌లో నటించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ వాటిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా రష్మిక పేరు ప్రచారంలోకి రాగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

Also Read:‘పెద్ది’ నాలుగో రోజు కలెక్షన్స్!

- Advertisement -