విదేశీ పెట్టుబడులే టార్గెట్‌గా ‘ఫారెక్స్ స్వాప్’

0
- Advertisement -

దేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెండు ప్రత్యేకమైన యూఎస్ డాలర్ – రూపాయి (USD-INR) ఫారెక్స్ స్వాప్ సౌకర్యాలను ప్రకటించింది.

(). కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్ల కోసం స్వాప్ .. కనీసం మూడేళ్ల నుంచి గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితితో సేకరించే కొత్త ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [FCNR(B)] డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. బ్యాంకులు ఏ రకమైన అంతర్జాతీయ కరెన్సీలోనైనా ఈ డిపాజిట్లను సేకరించవచ్చు. అయితే ఆర్‌బీఐతో జరిపే స్వాప్ లావాదేవీ మాత్రం కేవలం యూఎస్ డాలర్లలోనే జరుగుతుంది. డిపాజిట్ కాలపరిమితితోనే ఈ స్వాప్ గడువు ముడిపడి ఉంటుంది. ఈ సదుపాయం తక్షణమే అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 30, 2026 లోపు సేకరించిన డిపాజిట్ల కోసం అక్టోబర్ 16, 2026 వరకు ఈ స్వాప్ విండో అందుబాటులో ఉంటుంది.

ఈసీబీ మరియు ఓఎఫ్‌సీబీ రుణాల కోసం స్వాప్..పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (PSUs) సేకరించే కనీసం మూడేళ్ల సగటు కాలపరిమితి గల వాణిజ్య రుణాలు (ECBs) అలాగే బ్యాంకులు సేకరించే ఓవర్సీస్ ఫారిన్ కరెన్సీ రుణాలు (OFCBs) దీనికి అర్హత పొందుతాయి. ఈ రకమైన స్వాప్ లావాదేవీలను ఆర్‌బీఐ ప్రతిరోజూ పనిదినాల్లో నిర్వహిస్తుంది. దీనికి ఏటా 1.5 శాతం స్థిర వడ్డీ రేటు వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు. డిసెంబర్ 31, 2026 లోపు వచ్చే నిధుల కోసం జనవరి 15, 2027 వరకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

Also Read:ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక?

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రూపాయి విలువకు రక్షణ కల్పించడానికి దేశీయ బ్యాంకులను ఆర్థిక నష్టాల నుండి గట్టెక్కించేందుకు అలాగే విదేశీ మారక నిల్వలను పటిష్టం చేయడానికి ఆర్‌బీఐ ఈ ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

- Advertisement -