తెలంగాణలో మారిన వాతావరణం

2
- Advertisement -

తెలంగాణలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాగల కొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం పూర్తిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. రాబోయే 24 గంటల్లో నగరంలో మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతుండటంతో నేడు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మరియు ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని కోరారు.

పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున, ఉరుములు మరియు మెరుపులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు, పొలాల్లో పనిచేసే రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ వర్షాలు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ALso Read:పెద్ది..రెండోరోజు వసూళ్లివే!

- Advertisement -