పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల మధ్య….అమెరికా కీలకమైన ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవుతున్న నేపథ్యంలో తాము జప్తు చేసిన బిలియన్ల కొద్దీ డాలర్ల ఇరాన్ నిధులను.. యుద్ధం వల్ల నష్టపోయిన తమ గల్ఫ్ మిత్రదేశాల పునరుద్ధరణ పనుల కోసం ఉపయోగించాలని బిడెన్ పరిపాలనా యంత్రాంగం యోచిస్తున్నట్లు సమాచారం.
అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో స్తంభింపజేసిన ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ నిధులను ఈ ప్రక్రియ కోసం బదిలీ చేయనున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న శక్తుల దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఈ నిధులను కేటాయించనున్నారు. దీనికోసం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) లో ప్రత్యేక ఆర్డినెన్స్ లేదా చట్టాన్ని తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.
Also Read:పెద్ది..రెండోరోజు వసూళ్లివే!
పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో అమెరికా ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి చుట్టూ ఇరాన్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి మరియు అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం కారణంగా ప్రాంతీయ వాణిజ్యం ఇప్పటికే దెబ్బతింది. ఈ తరుణంలో ఇరాన్ ఆర్థిక మూలాలను మరింత దెబ్బతీయడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచవచ్చని అమెరికా భావిస్తోంది.

