సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పేట మండల కేంద్రంకు చెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్ ) గుండె పోటుతో మృతి చెందగా మృత దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వల్లే ఇవాళ నారాయణరావుపేట గ్రామానికి చెందిన కనకయ్య అనే మంచి రైతు బలి అయ్యాడు.. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డ్‌లో దాదాపు 45 రోజుల పాటు ఎవరూ కొనకుండా ఆలస్యం చేశారు. చివరికి వర్షం పడి ఆ వడ్లన్నీ తడిసిపోయాయి అన్నారు.
తడిసిన వడ్లను మిల్లుకు తీసుకెళ్లి ప్రాధేయపడితే, నాలుగు ట్రాక్టర్ల వడ్లకు గాను ఏకంగా 40 సంచుల వడ్లను మిల్లర్లు కట్ చేశారు… నా 40 సంచుల వడ్లు కట్ చేసిండ్రు అని నిన్న రాత్రి వరకు తోటి రైతులతో, కుటుంబ సభ్యులతో బాధపడుతూ, ఆ టెన్షన్ లోనే నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చి మరణించాడు. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే….హైదరాబాద్‌లో కూర్చొని 80% – 90% వడ్లు కొన్నామని ప్రభుత్వం చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లో ఇంకా 30% నుండి 40% వడ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి… వాతావరణం దారుణంగా ఉంది, వర్షాలు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రైతులు రెండు నెలలుగా వడ్లు అమ్ముకోలేక మిల్లులు, గోదాముల ముందు లారీలతో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రతి క్వింటాల్‌కు 4 నుండి 5 కిలోల కోత పెడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు… రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పంట పండించడం సులభంగా ఉంది కానీ, ఆ పంటను అమ్ముకోవాలంటే రైతులకు కళ్ళలో రక్తం వచ్చే పరిస్థితి (నరకం) కనిపిస్తోంది అన్నారు.
Also Read:కేటీఆర్‌కు ఎన్నారైల ఘన స్వాగతం
కుకునూరుపల్లి దగ్గర ఒక రాజస్థాన్ లారీలో వడ్లు ఎక్కించే ప్రయత్నం చేస్తే, ఆ లారీ వడ్లతో సహా రాజస్థాన్ వెళ్ళిపోయింది…. దుబ్బాక మండలం చేర్వాపూర్‌లో సంచులు ఎత్తకపోవడం వల్ల, అలాగే ఎన్సాన్ పల్లి లో కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు మొత్తం చెదలు పట్టిపోతున్నాయి… మంత్రి దామోదర రాజనర్సింహ గారి నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం, వెంకటాపూర్ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ వడ్లు కూడా కొనలేదు. ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి.రేవంత్ రెడ్డి రు క్షేత్రస్థాయి సమస్యలు వదిలేసి.. నేను మళ్ళీ గెలుస్తా, తొక్కుతా, పండబెడతా అంటూ తోండల భాష, తోతరి భాష మాట్లాడుతున్నారు తప్ప రైతులకు ఏం చేశారో చెప్పడం లేదు.. ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారు. గత 4 నెలల నుండి రాష్ట్రంలో చనిపోయిన రైతులకు రైతుబీమా అందడం లేదు, దానిని రద్దు చేశారు…. అధికారులు, మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మరియు కలెక్టర్ వెంటనే స్పందించి మరణించిన కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ధప్రాతిపదికన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలి అన్నారు.

