హార్రర్ మూవీ..ధురంధర్ రికార్డులు బ్రేక్!

1
- Advertisement -

ఒక కొత్త దర్శకుడు అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన హారర్ చిత్రం హాలీవుడ్‌లో తన బడ్జెట్ కంటే 100 రెట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలో కూడా మంచి ఆదరణ పొందుతూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఈ ఏడాదిలోనే అత్యంత భయంకరమైన హారర్ సెన్సేషన్‌గా నిలిచిన ఈ సినిమా పేరు ‘అబ్సెషన్’ (Obsession).

సరికొత్త దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం.. సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్‌ను భారీ బాక్సాఫీస్ వసూళ్లుగా మార్చుకోవడంలో విజయవంతమైంది. సుమారు 7,50000 డాలర్లు (రూ. 7.14 కోట్లు) నుండి 1 మిలియన్ డాలర్ల (రూ. 9.50 కోట్లు) పరిమిత బడ్జెట్‌తో మే 15న థియేటర్లలో విడుదలైన ‘అబ్సెషన్’.. కేవలం మూడు వారాల్లోనే తన బడ్జెట్ కంటే 10 రెట్ల కలెక్షన్లను సాధించి సంచలన విజయాల జాబితాలో చేరిపోయింది.

భారతీయ థియేటర్లలో విడుదలైన ఐదో రోజైన మంగళవారం నాడు ఈ చిత్రం రూ. 2.63 కోట్ల వసూళ్లను సాధించింది. సోమవారం వచ్చిన రూ. 2 కోట్ల వసూళ్లతో పోలిస్తే మంగళవారం కలెక్షన్లలో వృద్ధి కనిపించింది. దీనితో భారతదేశంలో ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 14.78 కోట్లకు చేరగా…నెట్ వసూళ్లు రూ. 12.38 కోట్లుగా నమోదయ్యాయి.

ఈ సినిమా కథ అంతా ‘బేర్’ (మైఖేల్ జాన్‌స్టన్) అనే ఒక ఒంటరి యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఒక రికార్డ్ స్టోర్‌లో పనిచేసే అతను.. తనతో పాటు పనిచేసే చిన్ననాటి స్నేహితురాలు ‘నిక్కీ’ (ఇండే నవరెట్)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. తన ప్రేమను వ్యక్తపరచడంలో పదే పదే విఫలమైన బేర్.. ఒక రహస్యమైన క్రిస్టల్ షాప్‌కి వెళ్లి ‘వన్ విష్ విల్లో’ అనే ఒక వింత వస్తువును కొనుగోలు చేస్తాడు. లోకంలో ఎవరూ ప్రేమించనంతగా నిక్కీ తనను ప్రేమించాలని అతడు ఆ వస్తువు ద్వారా కోరుకుంటాడు. అయితే, అతను కోరుకున్న కోరిక అత్యంత భయంకరమైన రూపంలో నెరవేరుతుంది. బేర్ పట్ల నిక్కీకి ఉన్న ప్రేమ కాస్తా విపరీతమైన పిచ్చిగా మారుతుంది. ఆమె ప్రేమ ఎంతలా ముదిరిపోతుందంటే.. అది క్రమంగా హింసాత్మకంగా మారి అతడిని ఊపిరాడకుండా చేస్తుంది. బేర్ ఆమెకు క్షణం దూరమైనా తట్టుకోలేకపోవడం, భయభ్రాంతులకు గురికావడం మరియు ఆమె ప్రవర్తన పూర్తిగా వింతగా మారడంతో సినిమా కథనం అత్యంత భయానక మలుపులు తిరుగుతుంది.

Also Read:వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా:కేటీఆర్

- Advertisement -