SRHకు భారీ షాక్..కమిన్స్ ఔట్!

0
- Advertisement -

ఐపీఎల్ 2027కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. వచ్చే సీజన్‌ ఐపీఎల్‌కు కమిన్స్ దూరం కానున్నాడు. రాబోయే వన్డే ప్రపంచ కప్ 2027 దృష్ట్యా తన పనిభారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టుకు 2027లో చాలా బిజీ షెడ్యూల్ ఉన్నందున, తాను ఐపీఎల్‌కు దూరంగా ఉండే అవకాశం ఉందని కమిన్స్ స్వయంగా హింట్ ఇచ్చాడు.

గత మూడు సీజన్లుగా కమిన్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఏడాది గాయం కారణంగా అతను టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

2027 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టుకు అంతర్జాతీయంగా చాలా బిజీ షెడ్యూల్ ఉంది. జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌తో వారి ఏడాది ప్రారంభమవుతుంది. మార్చిలో టెస్ట్ క్రికెట్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్‌తో ఒక ప్రత్యేకమైన టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్..ఆపై ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్నాయి.

Also Read:వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా:కేటీఆర్

ఇంతటి కఠినమైన షెడ్యూల్ ఉన్నందున…ఐపీఎల్ కంటే టెస్ట్ క్రికెట్ మరియు వన్డే ప్రపంచ కప్‌లకే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని కమిన్స్ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ఏదో ఒకదానిని వదులుకోవాల్సి వస్తే.. అది ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే ప్రపంచ కప్ మాత్రం కాదు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాను…ఫ్రాంచైజీతో కూడా మాట్లాడి ఏది సరైనదో చూస్తాను. పరిస్థితులు మారవచ్చు….ఇటీవల కొన్ని గాయాలు కూడా అయ్యాయి కాబట్టి నేను ఇప్పుడే దేనినీ ఖరారు చేయదలచుకోలేదు అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -