కడుపులో కత్తులు పెట్టుకుని పెదవులపై చిరునవ్వు పెట్టుకునే అలవాటు నాకు లేదు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే నాకు అహంకారం అంటారేమో కానీ నేను అహంకారం చూపిన సంఘటనలు చెప్పమంటే ఎవరు చెప్పరు అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా అందుకే అహంకారం అనుకుంటున్నారు అన్నారు.
గతంలో ఒక కార్యక్రమంలో జెన్ Gen Z ఉద్యమం వస్తుందని అంటే అందరూ నవ్వారు.. ఈరోజు సీజేఐ అన్న ఒక మాటను పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే సోషల్ మీడియాలో బీజేపీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు..కచ్చితంగా యువతలో బీజేపీ ప్రభుత్వంపై నిరాశ ఉంది అన్నారు.
వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తానని.. మా గుర్తు కారు మాకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసు అన్నారు. రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు.. మా నాయకుడు కేసీఆర్ అవసరం లేదు ..పవన్ కళ్యాణ్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని అనుకుంటున్నాను అన్నారు. అతని పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ డ్రామా చేస్తున్నాడు అన్నారు.
తెలంగాణను అభిమానించే వాళ్లు పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు… లేకపోతే ఏం చేయాలో ప్రజలకు తెలుసు అన్నారు కేటీఆర్. తుమ్మిడిహట్టి అనేది రేవంత్ రెడ్డి డైవర్షన్ గేమ్.. ఇప్పుడు అతను కూర్చుంటున్న ఆఫీసులోనే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తుకు పెంచడానికి ఒప్పుకోము అని రాసిన లేఖలు ఉన్నాయి ..కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ఒప్పించలేకపోయారు అన్నారు. అంత పట్టుదల ఉంటే పోయి మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు నిరహార దీక్ష చేయండి అని సూచించారు.
నిన్న రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ వేడుకల నుండి ఎండ తీవ్రత అని తప్పించుకుని పోయాడు…కానీ రైతులు ప్రభుత్వం పంట కొనడంలేదని ఎర్రటి ఎండలో ధర్నాలు చేస్తున్నారు…రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అన్నారు.
Also Read:కేరళకు నైరుతి..భారీ వర్షాలు!

