CBSE వెబ్‌సైట్ వైఫల్యం..ఓ గుణపాఠం!

3
- Advertisement -

CBSE వెబ్‌సైట్ మరియు దాని ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో తలెత్తిన లోపాలు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి. అంతేగాదు మనదేశ ఐటీ రంగం వైఫల్యాన్ని ఇది ప్రధానంగా ఎత్తిచూసింది. దేశంలోని అత్యంత కీలకమైన వెబ్‌సైట్‌ను కొందరు టీనేజర్లు సులభంగా హ్యాక్ చేయడం అత్యంత సిగ్గుచేటు.

ఈ వెబ్‌సైట్ భద్రతకు 10 కి సున్నా రేటింగ్ ఇస్తున్నారు ఐటీ ఎక్స్‌పర్ట్స్. అయితే, కేవలం CBSE మాత్రమే కాదు భారతదేశంలోని అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రత చాలా బలహీనంగా ఉంది.మన దేశంలో ప్రతిభావంతులైన ఐటీ నిపుణులు ఉన్నప్పటికీ పాలసీ లోపాలు, అవినీతి మరియు బాధ్యతారాహిత్యం కారణంగా వారు గూగుల్ లేదా యాపిల్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీలకే పని చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలు సమర్థత లేని వ్యక్తుల చేతుల్లో ఉండిపోయి తరచూ డేటా లీకేజీలకు గురవుతున్నాయి.

దేశంలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ‘CERT-In’ కూడా కేవలం టెక్ కంపెనీల అప్‌డేట్లను చూసి అడ్వైజరీలు (హెచ్చరికలు) జారీ చేయడానికే పరిమితమైంది కానీ సొంతంగా ఎటువంటి పటిష్టమైన ఆడిట్లు లేదా పరిశోధనలు చేయడం లేదు. ప్రభుత్వ విభాగాలు ఇప్పటికీ జిమెయిల్ వంటి థర్డ్-పార్టీ ఈమెయిళ్లను వాడుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

భవిష్యత్తులో చైనా వంటి సాంకేతికంగా బలమైన దేశంతో యుద్ధం వస్తే మన బలహీనమైన డిజిటల్ నెట్‌వర్క్ కారణంగా సీసీటీవీలు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల నియంత్రణను కేవలం కొద్ది రోజుల్లోనే కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు సైబర్ దాడుల కోసం ఉపయోగించగల ‘Mythos’ (ఆంత్రోపిక్ సంస్థ సృష్టించినది) వంటి అత్యాధునిక AI సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ఒక రక్షణ కవచంలా డిజిటల్ లోపాలను వెతకడానికి పుట్టినప్పటికీ…నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే మన దేశ డిజిటల్ రంగాన్ని క్షణాల్లో బూడిద చేయగలవు.

Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

కాబట్టి, భారత్ తక్షణమే సైబర్ భద్రత మరియు వ్యక్తిగత గోప్యత పై ఎటువంటి మినహాయింపులు లేని ఒక కఠినమైన జాతీయ విధానాన్ని తీసుకురావాలి అని సైబర్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

- Advertisement -