కేరళకు నైరుతి..భారీ వర్షాలు!

2
- Advertisement -

జూన్ 4న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగు నెలల పాటు రుతుపవనాలు కొనసాగుతాయని తెలిపింది భారత వాతావరణ శాఖ.

రుతుపవనాల వల్ల దక్షిణ, ఉత్తర భారత్ లో వాతావరణంలో గణనీయమైన మార్పులు ఉంటాయని తెలిపింది వాతావరణ శాఖ. కేరళ, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు, మహారాష్ట్రాలో, కేరళలో, గోవాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.

ఉత్తర భారత్ లో మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ , రాజస్థాన్ , హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని, దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 4,5 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

- Advertisement -