మౌంట్ రష్‌మోర్‌పై ట్రంప్..!

2
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. అమెరికాలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం మౌంట్ రష్‌మోర్ (Mount Rushmore) పై ఉన్న నలుగురు దిగ్గజ అమెరికా అధ్యక్షుల శిల్పాల పక్కనే తన ముఖం కూడా చెక్కినట్లు ఉన్న ఒక ఏఐ చిత్రాన్ని ఆయన షేర్ చేశారు. దీgతో అమెరికా అత్యున్నత నేతల సరసన తన పేరును కూడా శాశ్వతంగా నిలబెట్టుకోవాలనే తన పాత కలను ఆయన మళ్లీ గుర్తుచేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ లో ఎటువంటి క్యాప్షన్ లేకుండా కేవలం ఈ చిత్రాన్ని మాత్రమే పోస్ట్ చేశారు. సౌత్ డకోటాలోని బ్లాక్ హిల్స్‌లో ఉన్న మౌంట్ రష్‌మోర్ జాతీయ స్మారక చిహ్నంపై అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నలుగురు అధ్యక్షులు…జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడర్ రూజ్‌వెల్ట్, మరియు అబ్రహం లింకన్ ల ముఖచిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ షేర్ చేసిన చిత్రంలో అబ్రహం లింకన్ శిల్పానికి కుడి వైపున ట్రంప్ ముఖం కూడా ఉన్నట్లు ఏఐ ద్వారా సృష్టించారు.

మౌంట్ రష్‌మోర్‌పై తన ముఖాన్ని కూడా చేర్చాలనే కోరికను ట్రంప్ వ్యక్తపరచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో (2020లో) సౌత్ డకోటాలో జరిగిన నాలుగో జూలై (అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం) వేడుకల్లో మాట్లాడుతూ.. మౌంట్ రష్‌మోర్ స్మారక చిహ్నంపై ఉన్న నేతల వారసత్వాన్ని ఏ శక్తీ తుడిచిపెట్టలేదని, దానికి మరింత మంది నేతల గుర్తింపు దక్కాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Also Read:సూర్యవంశీపై సచిన్ ప్రశంసలు

- Advertisement -