నీట్ పేపర్ లీక్..పార్లమెంటరీ ప్యానెల్ భేటీ

3
- Advertisement -

నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీపై చర్చించడానికి విద్య, మహిళలు, పిల్లలు, యువజన & క్రీడల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. పార్లమెంట్ హౌస్ అవెన్యూ ఎక్స్‌టెన్షన్‌లోని కమిటీ రూమ్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

దీంతో పాటు సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి పరీక్షల్లో ‘ఆన్-స్క్రీన్-మార్కింగ్’ (OSM) విధానం, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమీక్షించేందుకు కమిటీ మంగళవారం ఉదయం 11 గంటలకు కూడా సమావేశం కానుంది. అలాగే 9, 10 తరగతుల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై కూడా కమిటీ చర్చించనుంది. పరీక్షల ప్రక్రియపై దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న తరుణంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అంతకుముందు శుక్రవారం జరిగిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్-యూజీ పరీక్షల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, లోపాలను సరిదిద్దాలని సభ్యులు నొక్కి చెప్పారు. పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) జరుపుతున్న దర్యాప్తు వివరాలను కూడా ఈ సందర్భంగా ప్యానెల్‌కు వివరించారు.

Also Read:సూర్యవంశీపై సచిన్ ప్రశంసలు

ఈ ఏడాది మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసి, జూన్ 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోండగా ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో లాతూర్‌కు చెందిన ఒక డాక్టర్, పుణేకు చెందిన ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఉన్నారు.

- Advertisement -