సీఎం పదవికి సిద్దూ రాజీనామా

8
- Advertisement -

మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు అన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత తన రాజీనామాను ప్రకటించారు. హైకమాండ్‌ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయమని కోరింది అన్నారు.

ఈ సమావేశానికి డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించిందని అందుకే సీఎం పదవి నుండి తప్పుకోవాలని కోరినట్లు సిద్ధరామయ్య ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ అధికార మార్పిడి ప్రక్రియను ఏఐసీసీ కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు దారి తీసిన ఈ పరిణామాల్లో భాగంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటుతో పాటు పార్టీలో కీలకమైన కేంద్ర బాధ్యతలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ జాతీయ స్థాయి పాత్రను సిద్ధరామయ్య వెంటనే అంగీకరించలేదని సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి నేరుగా సందేశం రావడంతోనే సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ గాంధీ గనుక తనను తప్పుకోవాలని కోరితే తాను వెంటనే రాజీనామా చేస్తానని సిద్ధరామయ్య గతంలో కూడా పలుమార్లు ప్రకటించారు.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

- Advertisement -