ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ తలకు గాయమైన సంగతి తెలిసిందే. ఇంకా ప్లే ఆఫ్ ఆశలు కేకేఆర్‌కు సజీవంగా ఉండగా చివరి మ్యాచ్‌లో గెలిస్తే చాలు. అయితే కేకేఆర్ లీడింగ్ స్కోరర్ రఘువంశీ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండటం ఆ జట్టుకు షాకనే చెప్పాలి.
ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం తలకు గాయానికి గురైన ఆటగాడు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలి. ఇది కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. రఘువంశీ అందుబాటులో లేకపోవడంతో, లక్ష్య ఛేదనలో కేకేఆర్ మనీష్ పాండేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. మనీష్ పాండే 33 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా జట్టులో అత్యంత ప్రతిభ చాటిన ఆటగాళ్లలో రఘువంశీ ఒకడు. ప్రస్తుతం కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడే అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ యువ ఆటగాడు 12 ఇన్నింగ్స్‌ల్లో 146.52 స్ట్రైక్ రేట్‌తో 422 పరుగులు చేశాడు.
Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!
కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే.. ముంబై ఇండియన్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. అలాగే ఢిల్లీపై కేకేఆర్ ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తే.. కేకేఆర్ ఢిల్లీపై భారీ రన్ రేట్‌తో గెలవాల్సి ఉంటుంది.

