రోమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం భారత్, ఇటలీ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి అడుగుపెట్టాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు 2029 నాటికి 20 బిలియన్ యూరోల విలువైన వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి.
జార్జియా మెలోనితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ భారత్-ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. భారత్ మరియు ఇటలీ తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకుంటున్నాయి. భారత్-ఇటలీ సంబంధాలు ఇప్పుడు తమ పూర్తి సామర్థ్యాన్ని సాకారం చేసుకోగలవు అని ప్రధాని మోదీ అన్నారు.
ఇరు దేశాల భాగస్వామ్యానికి ఆచరణాత్మక మరియు భవిష్యత్ రూపకల్పనను అందించేలా భారత్-ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029ను కూడా ఆయన ప్రకటించారు. మేము ఈ ప్రణాళికపై కాలపరిమితితో కూడిన పద్ధతిలో ముందుకు సాగుతున్నాము. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు దూసుకుపోతోంది. భారతదేశంలో ఉన్న 400 కి పైగా ఇటాలియన్ కంపెనీలు భారత వృద్ధి పథంలో కీలక సహకారం అందిస్తున్నాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ భారత్, ఇటలీ దేశాలు తమ బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయని, ఇది ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు నమోదైన అత్యున్నత స్థాయి సంబంధమని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే ఎంతో బలంగా ఉన్నాయని, పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగగలవని ఆమె అన్నారు.
గడిచిన మూడున్నర ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీతో తాను జరిపిన ఏడు సమావేశాలే ఈ ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి కారణమని మెలోని కొనియాడారు. పరస్పర గౌరవం, నమ్మకంతో ఇద్దరు నేతల మధ్య ఒక నిజాయితీ గల స్నేహం ఏర్పడిందని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ యొక్క దూరదృష్టి, ఆచరణాత్మకత మరియు నాయకత్వ పటిమను ఆమె ప్రశంసించారు, ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా భారత పౌరులలో ఆయనకు ఉన్న ప్రజాదరణను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.తమ మధ్య ఉన్న వ్యక్తిగత సత్సంబంధాలు ఇరు దేశాలు వేగంగా మరియు సమర్థవంతంగా కలిసి పనిచేయడంలో కీలక పాత్ర పోషించాయని మెలోని అభిప్రాయపడ్డారు.
Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!

