టాలీవుడ్ ప్రముఖ హీరో, ‘ఉస్తాద్’ రామ్ పోతినేని రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నారు. తన యాక్టింగ్‌తోనే కాకుండా అద్భుతమైన వ్యక్తిత్వంతో మరోసారి అందరి మనసులను గెలుచుకున్నారు. గత 18 ఏళ్లుగా ‘ఫ్రీడ్రిచ్ అటాక్సియా’ అనే అరుదైన నరాల వ్యాధితో పోరాడుతున్న ఒక వీరాభిమాని కలను నిజం చేసి, తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నారు.
ఆ యువతి కలను నిజం చేస్తూ స్వయంగా ఆమె ఇంటికే వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు.సదరు యువతి రామ్ పోతినేనికి వీరాభిమాని. గత 18 ఏళ్లుగా వీల్ చైర్‌కే పరిమితమై ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నప్పటికీ, ఆమెకు రామ్ సినిమాలు మరియు ఆయన సానుకూల దృక్పథం ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఎలాగైనా తన అభిమాన హీరోను ఒక్కసారైనా కలవాలని, ఆమె తన మనసులోని కోరికను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేసింది. ఈ విషయం కాస్తా హీరో రామ్ దృష్టికి వెళ్లింది.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అభిమానులను తమ ఆఫీస్‌కో లేదా షూటింగ్ స్పాట్‌కో పిలిపించుకుంటారు సెలబ్రిటీలు. కానీ, ఆ యువతి శారీరక పరిస్థితిని అర్థం చేసుకున్న రామ్.. ఆమెను ఇబ్బంది పెట్టకూడదని భావించారు. షూటింగ్ బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, సమయం కేటాయించి స్వయంగా ఆ యువతి ఇంటికి వెళ్లారు.
రామ్‌ను తన కళ్లముందు చూసిన ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ యువతి పక్కన కూర్చుని, ఆమె చేతులు పట్టుకుని రామ్ కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకూడదని, ఈ సుదీర్ఘ పోరాటంలో ఆమె చూపించిన ధైర్యం ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ఆమెకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!
