నీట్ పేపర్ లీకేజీలపై కేజ్రీవాల్

1
- Advertisement -

నీట్-యూజీ పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా గళమెత్తాలని దేశంలోని యువతకు, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) తరానికి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి యువత పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న పేపర్ లీక్ మాఫియాపై తిరగబడాలని ఆయన కోరారు. “మన జెన్-జీ యువత తలుచుకుంటే అవినీతి మంత్రులను జైలుకు పంపలేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.పేపర్ లీకేజీలు నిరంతరం జరుగుతుండటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కేజ్రీవాల్ విమర్శించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని వ్యవస్థ వల్ల కష్టపడి చదివే విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అన్యాయానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలపాలని, అప్పుడే ప్రభుత్వంలో చలనం వస్తుందని ఆయన సూచించారు.కేవలం అరెస్టులతో సరిపెట్టకుండా, పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని, బాధ్యులైన ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also Read:TTD:శ్రీవారి టికెట్లలో అవకతవకలు

నీట్ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న తరుణంలో, కేజ్రీవాల్ నేరుగా యువతను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -