నార్వే మాజీ మంత్రి మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం (UNEP) మాజీ అధిపతి ఎరిక్ సోల్హీమ్…ప్రధాని మోదీ నాయకత్వాన్ని, ఆయన దార్శనికతను కొనియాడారు. పాశ్చాత్య దేశాల నాయకులు మోదీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోని ఏ ముఖ్యమైన దేశంలోనూ మోదీ అంతగా స్వదేశీయులచే ప్రేమించబడే నాయకుడు మరొకరు లేరని సోల్హీమ్ వ్యాఖ్యానించారు. మోదీకి దాదాపు 70 శాతం ఆమోదం ఉందని, ఇది ఒక ప్రజాస్వామ్య నాయకుడికి అసాధారణమని పేర్కొన్నారు. పర్యావరణ హితమైన అభివృద్ధి (Green Growth) ద్వారా 150 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి ఎలా తప్పించవచ్చో చెబుతారని సోల్హీమ్ ప్రశంసించారు.
గుజరాత్ లోని వడ్ నగర్ రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకున్న స్థాయి నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఎదిగిన మోదీ వ్యక్తిగత ప్రయాణం స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. భారతదేశం ప్రస్తుతం 7 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, 2050 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన అంచనా వేశారు.
ALso Read:TTD:శ్రీవారి టికెట్లలో అవకతవకలు
భారత్ లోని మారుమూల ప్రాంతాలకు రోడ్లు, ఆధునిక విమానాశ్రయాలు, గుజరాత్ లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ వంటి ప్రాజెక్టులను చూస్తుంటే అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని సోల్హీమ్ పేర్కొన్నారు.

