కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటూ, విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బంగారం, వెండిపై మొత్తం దిగుమతి సుంకం సుమారు 6 శాతంగా ఉండగా, తాజా నిర్ణయంతో అది 15 శాతానికి చేరింది. ప్రభుత్వం ఈ పెంపును రెండు విభాగాలుగా విభజించింది:
బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD): ఇదివరకు ఉన్న రేట్ల నుంచి 10 శాతానికి పెంచారు.అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC): దీనిని 5 శాతంగా నిర్ణయించారు.మొత్తం పన్ను వెరసి పసిడి, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెరిగింది.
ఇటీవల పశ్చిమాసియా (Middle East) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడటంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దు” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విదేశీ కరెన్సీ అనవసరంగా బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చమురు దిగుమతుల కోసం భారీగా డాలర్లు ఖర్చవుతున్న వేళ, బంగారం దిగుమతులను తగ్గించి ఫారెక్స్ నిల్వలను కాపాడటం. పెరుగుతున్న వాణిజ్య లోటు (Trade Deficit) వల్ల రూపాయి విలువ పడిపోకుండా చూడటం. ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే, ఇతర ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం.
Also Read:సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్!
ఈ పన్ను పెంపు వల్ల తక్షణమే మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో మధ్యతరగతి ప్రజలపై ఇది అదనపు భారంగా మారనుంది.

