SIRపై కేసీఆర్‌ దిశానిర్దేశం

9
- Advertisement -

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం సుధీర్ఘంగా జరిగింది.దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చించి సమావేశం నిర్ణయాలు తీసుకున్నది.

ముఖ్యాంశాలు :

1) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) చేపట్టిన SIR ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని డిజిటలైజేషన్ పద్దతిలో జరపాలని, బిఆర్ఎస్ ప్రార్టీ ప్రధాన కార్యదరర్శుల సమావేశం అభిప్రాయ పడింది.

2) ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ సమన్వయ కర్తను నియమించాలని నిర్ణయించడం జరిగింది.

3) ప్రతీ మండలాని, మున్సిపల్ బాడీల వారిగా, ‘సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం జరిగింది.

4) డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున, రాష్ట్రంలో వున్న 35,655 పోలింగ్ బూత్ లలో., బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని , ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల పై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.

5) పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్దతిలో చేపట్టేందుకు తగిన శిక్షణా శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని నిర్ణయం జరిగింది

సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించబడిన ఇంచార్జీల వివరాలు :

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శి.

జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి

ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు –సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి

జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు -పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి.

మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు- గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు- రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.

వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.

మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రి

గద్వాల్,నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాలు— మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి

మేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్

హైదరాబాద్ జిల్లా— తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

నల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.

- Advertisement -