పశ్చిమ ఆసియాలో (Middle East) నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ఒక కొత్త శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా మరియు ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు నేరుగా లేని కారణంగా, ఇరాన్ తన ప్రతిపాదనను పాకిస్థాన్ ద్వారా వాషింగ్టన్‌కు చేరవేసింది.గత కొంతకాలంగా ఇజ్రాయెల్ మరియు ఇతర ప్రాంతీయ శక్తులతో ఇరాన్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో, ఈ ప్రతిపాదన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమ ఆసియాలో మరింత రక్తపాతం జరగకుండా ఉండటం మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడం ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.ఇరాన్ పంపిన ఈ ప్రతిపాదనపై అమెరికా అధికారులు ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, ఈ ప్రతిపాదనలోని అంశాలను అమెరికా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఇజ్రాయెల్ మరియు హమాస్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ప్రమేయంపై అమెరికా తీవ్ర అసహనంతో ఉంది. ఈ క్రమంలో ఇరాన్ స్వయంగా శాంతి చర్చల కోసం ముందడుగు వేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
Also Read:ఆర్‌అండ్‌బీ టెండర్లలో అవినీతి:హరీష్

