పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మోయిత్రాపై ఢిల్లీలోని మందిర్ మార్గ్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రజల్లో గందరగోళం సృష్టించి, ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఒక “నకిలీ AI-జనరేటెడ్ (కృత్రిమ మేధతో రూపొందించిన) వీడియోను” ప్రచారం చేశారని ఆమెపై ఫిర్యాదు అందింది.
బెంగాల్ ఎన్నికల రెండో దశ పోలింగ్ కోసం అబ్జర్వర్‌గా నియమితులైన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ వీడియోను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోను రూపొందించడానికి AI టెక్నాలజీని ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజయ్ పాల్ శర్మ టీఎంసీ నాయకులను హెచ్చరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై టీఎంసీ స్పందిస్తూ.. అధికారి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, అజయ్ పాల్ శర్మ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఈ వీడియోను సర్క్యులేట్ చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్

