ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ మరియు వాటికి సంబంధించిన విధివిధానాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలు సంస్థలకు భూములు కేటాయించే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు మరియు సరఫరాకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.ఇటీవలే మంత్రుల బృందం సింగపూర్‌లో పర్యటించి అక్కడ అధ్యయనం చేసిన అభివృద్ధి నమూనాలు, పరిపాలనా అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నారు.
Also Read:తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్

