టీడీపీ ఎమ్మెల్యే..పల్లెబాట

6
- Advertisement -

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రాజకీయాలు సరికొత్త పంథాను సంతరించుకున్నాయి. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కంచెర్లవానిపురంలో ఆయన చేపట్టిన పర్యటన ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రజల కష్టనష్టాలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కృష్ణా జిల్లా కంచెర్లవానిపురంలో “పల్లెబాట 2.0” కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఆడంబరాలకు పోకుండా, సామాన్యుడిలా సైకిల్‌పై గ్రామంలో కలియతిరుగుతూ స్థానికులను పలకరించారు. కంచెర్లవానిపురంలో జరిగిన ఈ పర్యటనలో ఎమ్మెల్యే గ్రామ వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ, ప్రజలతో నేరుగా ముచ్చటించారు.

తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి వంటి మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.వాహనాల హడావిడి లేకుండా సాదాసీదాగా వచ్చిన ఎమ్మెల్యేను చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను స్వేచ్ఛగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలకు, ప్రజాప్రతినిధికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు వర్ల కుమార్ రాజా ఒక వినూత్న డిజిటల్ చొరవను ప్రారంభించారు. అదే “వాట్సాప్ యువర్ ఎమ్మెల్యే”.

సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్: 9908833636

నియోజకవర్గంలోని ప్రజలు తమకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ ద్వారా పంపవచ్చని ఆయన సూచించారు. “మీ సమస్య ఏదైనా.. ఒక్క మెసేజ్ చేయండి, పరిష్కారానికి నేను ఉన్నాను” అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. “ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందాలన్నదే మా లక్ష్యం. పల్లెబాట ద్వారా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -