వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ మరియు లెబనాన్ దేశాలు కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇది ఒక “చారిత్రాత్మక మరియు గణనీయమైన” ముందడుగు అని ఆయన అభివర్ణించారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
రాబోయే రెండు వారాల్లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్యామిన్ నెతన్యాహు మరియు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ వాషింగ్టన్‌లో భేటీ అయ్యే అవకాశం ఉందని 79 ఏళ్ల రిపబ్లికన్ నాయకుడు ట్రంప్ సూచించారు. “వారు గొప్ప వ్యక్తులు. ఇరు దేశాలు పక్కపక్కనే ఉన్నప్పటికీ, ఆ ఇద్దరు నేతలు ఇంతవరకు ఎప్పుడూ కలుసుకోలేదు. త్వరలోనే వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు.
వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో పక్కన ఉండగా ట్రంప్ మాట్లాడుతూ.. “మరో మూడు వారాల పాటు కాల్పులు జరపకూడదని వారు అంగీకరించారు. అయితే హిజ్బుల్లా గురించి మనం ఆలోచించాల్సి ఉంది” అని అన్నారు. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినందుకు ఇరు దేశాలు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపాయి.
భవిష్యత్తులో రెండు దేశాల మధ్య శాంతిని అధికారికం చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.ట్రంప్ నినాదమైన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ తరహాలోనే, ఆయన సహాయంతో మేము “లెబనాన్‌ను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాము అన్నారు. కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, శాంతికి అడ్డంకిగా ఉన్న హిజ్బుల్లాను నిరాయుధులను చేయాలని లెబనాన్‌ను ఇజ్రాయెల్ కోరింది. ఇరాన్ ఆక్రమణ నుండి విముక్తి పొందితేనే లెబనాన్‌కు స్వతంత్ర భవిష్యత్తు ఉంటుందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇదే క్రమంలో, ప్రాంతీయ శాంతి నెలకొనాలంటే ఇరాన్ తప్పనిసరిగా హిజ్బుల్లాకు ఇచ్చే నిధులను నిలిపివేయాలని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

