మహిళల కలలను ధ్వంసం చేశారు!

6
- Advertisement -

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కోటా బిల్లుపై ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన ప్రధాని.. వ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. కుటుంబ పార్టీలు తమ స్వార్థ రాజకీయాలకు ముగింపు పడుతుందనే భయంతోనే మహిళలు ముందుకు రావడాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

ఈరోజు నేను దేశంలోని మహిళలకు అత్యంత కీలకమైన విషయం గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. మహిళల పురోగతిని ఎలా అడ్డుకుంటున్నారో దేశ పౌరులందరూ గమనిస్తున్నారు. మా శతవిధ ప్రయత్నాలు చేసినప్పటికీ, ‘నారీ శక్తి వందన్ అధినియం’లో సవరణలు చేయడంలో మేము విజయం సాధించలేకపోయాము. దీనికి గాను దేశంలోని తల్లులు మరియు సోదరీమణులందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను అని ప్రధాని పేర్కొన్నారు.

బిల్లు వీగిపోయినప్పుడు ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును ప్రధాని తప్పుబట్టారు. నిన్న కోట్లాది మంది మహిళలు పార్లమెంట్ వైపు చూస్తున్నారు. మహిళా ప్రయోజనాల కోసం మేము తెచ్చిన ప్రతిపాదన వీగిపోయినప్పుడు కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి కుటుంబ పార్టీలు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం చూసి నేను చాలా బాధపడ్డాను…శిక్ష తప్పదు: “మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించి ప్రతిపక్షాలు చేసిన పాపానికి కచ్చితంగా శిక్ష పడుతుంది. వీరు రాజ్యాంగ నిర్మాతలను కూడా అవమానించారు. ప్రజలు ఇచ్చే శిక్ష నుండి వీరు తప్పించుకోలేరు అన్నారు.

నారీ శక్తి వందన్ సవరణ అనేది సమయానికి అవసరమైన నిర్ణయమని, ఇది చిన్న-పెద్ద రాష్ట్రాలన్నింటినీ బలోపేతం చేసి, మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించినదని ప్రధాని తెలిపారు. తమ కుటుంబాలకు బయట ఉన్న మహిళలు ఎదగడం ఈ పార్టీలకు ఇష్టం లేదు. పంచాయతీలు, స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటుతున్న లక్షలాది మంది మహిళలు ఇప్పుడు లోక్‌సభ, అసెంబ్లీల్లో సేవ చేయాలనుకుంటున్నారు. సీట్ల సంఖ్య పెరిగి మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందనే భయంతోనే వీరు అడ్డుపడ్డారు..కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంస్కరణల పట్ల అబద్ధాలను ప్రచారం చేస్తుందని మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ తన దశాబ్దాల నాటి తప్పును సరిదిద్దుకుంటుందని నేను ఆశించాను, కానీ వారు చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల భుజాలపై పరన్నజీవిలా బతుకుతోంది. విభజించు పాలించు అనే రాజకీయాల ద్వారా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది అని దుయ్యబట్టారు.

Also Read:ఎముకల బలహీనత..కారణాలివే!

- Advertisement -