చెన్నై జోరుకు హైదరాబాద్ బ్రేక్!

11
- Advertisement -

శనివారం (ఏప్రిల్ 18) జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ (23) నెమ్మదిగా ఆడినా, పవర్‌ప్లే ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 75/4 స్కోరుతో పటిష్టంగా ఉంది.

మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ (59 పరుగులు, 39 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్ తలో మూడు వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్‌ను 200 పరుగుల లోపే కట్టడి చేశారు. ముఖేష్ చౌదరి కూడా రెండు వికెట్లు తీశాడు.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. నితీష్ కుమార్ రెడ్డి తన రెండో ఓవర్లోనే సంజూ శాంసన్‌ను అవుట్ చేశాడు. ఆయుష్ మాత్రే (30), రుతురాజ్ గైక్వాడ్ రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే నితీష్…మాత్రేను అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.ఈశాన్ మాలింగ తను వేసిన మొదటి బంతికే కెప్టెన్ గైక్వాడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ (25), మాథ్యూ షార్ట్ వికెట్లను కూడా తీసి సిఎస్‌కేను కోలుకోలేని దెబ్బ తీశాడు.

Also Read:ఎముకల బలహీనత..కారణాలివే!

9వ ఓవర్ నుండి దాదాపు 28 బంతుల పాటు సిఎస్‌కే బ్యాటర్లు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగుల వేగాన్ని తగ్గించారు. చివర్లో జేమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ కొన్ని భారీ షాట్లు ఆడినా, అప్పటికే లక్ష్యం చేయిదాటిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో సిఎస్‌కే 184 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

- Advertisement -