బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్రంలో పెద్ద రాజకీయ మార్పుకు మార్గం సుగమమైంది.రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ … నితీష్ కుమార్ చేత ప్రమాణం చేయించారు.
మార్చి 16న ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత చట్టప్రకారం 14 రోజుల్లోగా బీహార్ శాసన మండలి సభ్యత్వానికి (MLC) రాజీనామా చేయాల్సి ఉండగా, ఆయన మార్చి 30న తన పదవికి రాజీనామా చేశారు.
నితీష్ కుమార్ రాజ్యసభలోకి వెళ్లడంతో, ఆయన దీర్ఘకాల ముఖ్యమంత్రి పదవికి ముగింపు పలికినట్లైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నేతలు కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనుంది.
Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం
సమాచారం ప్రకారం, ఏప్రిల్ 14న బీహార్‌కు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.

