కామాఖ్య దేవి ఆలయంలో అస్సాం సీఎం

10
- Advertisement -

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రార్థనలు చేశారు.

ఈ సందర్శన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు సమాచారం.

గువాహటి నగరంలోని నీలాచల్ పర్వతంపై ఉన్న కామాఖ్య దేవి ఆలయం దేశంలోని అత్యంత పవిత్ర శక్తి పీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. ప్రస్తుతం అస్సాంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆలయాలను సందర్శించి ఆశీస్సులు పొందడం సాధారణంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం హిమంత బిశ్వ శర్మ ..అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

- Advertisement -