‘పెద్ది’…ఓటీటీ అదిరే డీల్!

6
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌లో భారీ హైప్ సృష్టిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ.130 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల హక్కులు కలిపి ఈ డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఒక తెలుగు సినిమా ఓటీటీ రైట్స్ ద్వారానే ఇంత పెద్ద మొత్తం సాధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా ఆసక్తికరంగా, థియేటర్లలో సినిమా సాధించే విజయాన్ని బట్టి అదనంగా రూ.20 కోట్ల బోనస్ ఇవ్వాలని కూడా ప్రతిపాదించిందట. దీంతో ఈ డీల్ మొత్తం విలువ రూ.150 కోట్లకు చేరే అవకాశముంది. ఇది రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్‌ను మరింతగా చూపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:అరుణాచల్ సీఎంపై సీబీఐ దర్యాప్తు

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్నారు. రామ్ చరణ్ ‘పెద్ది పహిల్వాన్’గా, అలాగే క్రికెటర్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా, విడుదల తర్వాత నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -