భారతీయ సినీ పరిశ్రమలో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరవడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే Crunchyroll Anime Awards వేడుకలో ఈసారి ఆమె ప్రజెంటర్‌గా ఎంపిక కావడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
2024లో ఇదే అవార్డ్స్ వేదికపై తన గ్లామర్‌తో ఆకట్టుకున్న రష్మిక మందన్న, ఇప్పుడు 2026లో మళ్లీ అదే వేదికపై కనిపించనుండటం విశేషం. వరుసగా రెండోసారి ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో భాగమవడం ఆమె గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక జపాన్ లోని ప్రముఖ నగరం Tokyoలో మే 23న అట్టహాసంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యానిమే అభిమానులు, క్రియేటర్లు, నటులు ఈ వేడుకకు హాజరవుతారు.\
Also Read:ఇది ప్రజాపాలన కాదు…నిరంకుశ పాలన:BRSV
రష్మిక మందన్న ఈ అవార్డ్స్‌లో ప్రజెంటర్‌గా పాల్గొనడం భారతీయ సినీ రంగానికి గర్వకారణం. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా తన ప్రతిభను చాటుకుంటూ ఆమె ముందుకు సాగుతోంది.

