అమెరికాలో మరోసారి అత్యాధునిక యుద్ధ విమానం ప్రమాదానికి గురైన ఘటన చర్చనీయాంశమైంది. ప్రపంచంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఫైటర్ జెట్‌గా పేరుగాంచిన F-35 Lightning II కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ఘటన అమెరికాలోని లాస్ వేగాస్ సమీపంలోని నెవాడ టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ పరిధిలో చోటుచేసుకుంది. శిక్షణ కార్యక్రమం సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ప్రమాద సమయంలో విమానం నడిపిస్తున్న పైలట్ సమయానికి బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. అతనికి స్వల్ప గాయాలు అయినప్పటికీ, వైద్య చికిత్స తర్వాత కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనను అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది.ప్రాథమికంగా సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.
Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!
అత్యాధునిక ఫైటర్ జెట్ అయిన ఎఫ్-35 తరచూ ఇలాంటి ఘటనల్లో వార్తల్లోకి రావడం రక్షణ రంగ నిపుణుల మధ్య చర్చకు దారితీసింది. ఈ విమానం భద్రత, నిర్వహణపై మరింత పరిశీలన అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

