తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక రంగానికి ఊతమిస్తూ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూ.157 కోట్ల వ్యయంతో దేశంలోనే అతి పెద్ద గోశాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.
హైదరాబాద్ శివారులోని ఎన్కేపల్లిలో ఈ భారీ గోశాల నిర్మాణం చేపట్టనున్నారు. ఆధునిక సదుపాయాలతో గోశాలను అభివృద్ధి చేసి, పశుసంవర్ధక రంగానికి ఆదర్శంగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ గోశాలలో పశువుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.పశువులు స్నానం చేయడానికి ప్రత్యేక షవర్లు,గోపూజ నిర్వహణ కోసం ప్రత్యేక టెంపుల్ కాంప్లెక్స్,
ఒక్కో షెడ్డులో 100 ఆవులు ఉండేలా 10 ఆధునిక షెడ్లు,మేత ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు.
సుమారు 54 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ విధానంతో పశువుల మేత పెంచే ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల పశువులకు నాణ్యమైన ఆహారం నిరంతరం అందుబాటులో ఉండేలా చూస్తారు. గోశాల పరిధిలోనే పశువైద్యశాల నిర్మించి, వైద్యులు, సిబ్బంది, పారా మెడికల్ ఉద్యోగులకు క్వార్టర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పశువులకు తక్షణ వైద్య సేవలు అందించవచ్చు.
ఈ భారీ గోశాల ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో పశుసంవర్ధక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆధునిక సదుపాయాలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ దేశంలోనే ఒక మోడల్‌గా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read:దూబే..సీఎస్‌కేకు కీలకం కానున్నాడా?

