ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం:ట్రంప్

13
- Advertisement -

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా గెలిచిందని, ఇరాన్ నౌకాదళం, వాయుసేన పూర్తిగా నాశనమైందని ఆయన పేర్కొన్నారు.

హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్…మేము ప్రస్తుతం చర్చల్లో ఉన్నాం. వారు ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. వారి నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దాదాపు లేవు. మొత్తానికి వారి వద్ద ఉన్నదంతా నాశనం అయింది అన్నారు.

ఇరాన్‌తో శాంతి చర్చలపై ఆశాభావం గురించి మాట్లాడుతూ…ఈ సమస్యను ముగిస్తామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పలేను కానీ మేము గెలిచాం. మా విమానాలు టెహ్రాన్ సహా వారి దేశంలోని పలు ప్రాంతాలపై ఎగురుతున్నాయి. వారు ఏమీ చేయలేరు. అవసరమైతే పవర్ ప్లాంట్‌లను కూడా ధ్వంసం చేయగలం. సైనికంగా వారు పూర్తిగా ఓడిపోయారు అని వ్యాఖ్యానించారు.

అలాగే, ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదని, ఆ విషయంపై వారు అంగీకరించారని ట్రంప్ తెలిపారు. మాకు కావాల్సినదాన్ని మేము నియంత్రించగలం. ఇకపై వారికి అణ్వాయుధాలు ఉండవు అన్నారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగించడానికి కారణం ఏమిటని అడిగిన ప్రశ్నకు ట్రంప్…వారు ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న వారు మాకు ఒక పెద్ద బహుమతి ఇచ్చారు. అది భారీ విలువ కలిగినది. అది ఆయిల్, గ్యాస్‌కు సంబంధించినది. అది చూస్తే మేము సరైన వ్యక్తులతో మాట్లాడుతున్నామనే భావన కలిగింది అని చెప్పారు.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

- Advertisement -