రాష్ట్రంలో ఇంధన కొరత లేదు:స్టీఫెన్ రవీంద్ర

6
- Advertisement -

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ఖండిస్తూ సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇంధన సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని ఆయన తెలిపారు. నిన్న ఒక్క రోజే సుమారు 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను రాష్ట్రంలోని పెట్రోల్ బంకులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 20 వేల కిలోలీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని చెప్పారు.

రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన వివరించారు. వదంతులు నమ్మి వాహనదారులు అనవసరంగా ఎక్కువగా పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

ప్రజలు అపోహలకు లోనుకాకుండా, సాధారణంగా ఇంధనం వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. మొత్తంగా రాష్ట్రంలో ఇంధన పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని సివిల్ సప్లై శాఖ హామీ ఇచ్చింది.

- Advertisement -