క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు

6
- Advertisement -

మత మార్పిడి అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినవారికే షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హోదా వర్తిస్తుందని స్పష్టం చేసింది.

జస్టిస్ పీకే మిశ్రా, అంజారియాల బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన దళితులు ఎస్సీ హోదాను కోల్పోతారని కోర్టు తేల్చిచెప్పింది.అలాగే, క్రైస్తవ మతంలోకి మారిన దళితులు SC/ST (Prevention of Atrocities) Act కింద రక్షణ పొందలేరని కోర్టు పేర్కొంది.

ఈ కేసు పాస్టర్ ఆనంద్ దాఖలు చేసిన అప్పీల్ నేపథ్యంలో విచారణకు వచ్చింది. ఆయనపై కుల వివక్ష, దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన 2025 మే తీర్పును సవాల్ చేశారు.

తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు “హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందని వ్యక్తులు ఎస్సీ వర్గానికి చెందినవారిగా పరిగణించబడరు. మత మార్పిడి జరిగితే ఎస్సీ హోదా కోల్పోతారు” అని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మత మార్పిడి మరియు కుల హోదాలపై ఉన్న చట్టపరమైన స్పష్టత మరింత బలపడింది.

Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

- Advertisement -