లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపు!

9
- Advertisement -

దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను సుమారు 50 శాతం పెంచే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

ప్రస్తుతం 543గా ఉన్న లోక్ సభ స్థానాలను 816కు పెంచే ప్రతిపాదనపై కేంద్రం పని చేస్తోంది. అదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలను 4,123 నుంచి 6,185కు పెంచే యోచనలో ఉంది.రాష్ట్రాల వారీగా కూడా ఈ పెంపు ప్రభావం ఉండనుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కు,ఆంధ్రప్రదేశ్‌లో 263కు పెరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. 2029 సాధారణ ఎన్నికల నుంచే ఈ మార్పులను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఈ అంశంపై ఎన్‌డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, ప్రజలకు మరింత ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా, నియోజకవర్గాల పునర్విభజనలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Also Read:‘డెకాయిట్‌’ ..సెకండ్ సింగిల్

- Advertisement -