సుందర్ పూనమ్..షూటింగ్ ప్రారంభం

8
- Advertisement -

బాలీవుడ్ నటి సాన్య మల్హోత్రా తన కొత్త సినిమా Sundar Poonam షూటింగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. భక్షక్ ఫేమ్ డైరెక్టర్ పుల్‌కిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.టిప్స్ ఫిల్మ్స్ మరియు అబుందత్య ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై కుమార్ తరుణి, విక్రమ్ మల్హోత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథను దర్శకుడితో పాటు జ్యోత్స్న నాథ్ అందించారు.

“దంగల్”, “బధాయి హో”, “కథల్” వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన సన్యా మల్హోత్రా, ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. “#SundarPoonam It begins” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఈ సినిమాలో అదిత్య రావల్ కూడా నటిస్తున్నారు. నిజజీవిత నేర ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. అందులో సన్యా వధువు వేషంలో, భారీ లెహంగా, ఆభరణాలతో కనిపించింది.

Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

ఇక సన్యా మల్హోత్రా చివరిగా నటించిన చిత్రం “Sunny Sanskari Ki Tulsi Kumari” 2025లో విడుదలైంది. Shashank Khaitan దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించారు.

- Advertisement -