మహిళా అధికారుల నియామకంపై సుప్రీం!

7
- Advertisement -

మహిళా అధికారులకు న్యాయం చేస్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC)లో పనిచేస్తున్న మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ (Permanent Commission) ఇవ్వాలని స్పష్టం చేసింది. సిస్టమ్‌లో ఉన్న లింగ వివక్షను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మహిళా అధికారుల మూల్యాంకన విధానం లోపభూయిష్టంగా ఉందని, అన్యాయంగా 250 మంది అధికారుల పరిమితి విధించడం సరైంది కాదని తేల్చిచెప్పింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తన ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా అధికారులను ఆర్మీ, నేవీ లో అన్యాయంగా అంచనా వేశారని కోర్టు అభిప్రాయపడింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్, “పర్మనెంట్ కమిషన్ పురుషులకే పరిమితం కావాలని భావించడం సరైంది కాదు. మహిళలకు ఈ అవకాశాన్ని నిరాకరించడం లింగ వివక్షే” అని వ్యాఖ్యానించింది.

కోర్టు పరిశీలనలో బయటపడిన ముఖ్య అంశాలు:

మహిళా అధికారుల ACR (Annual Confidential Reports)ను నిర్లక్ష్యంగా తయారు చేయడం
వారికి పర్మనెంట్ కమిషన్ లభించదనే ముందస్తు భావనతో అంచనా వేయడం
పురుష అధికారులతో పోలిస్తే తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం

కీలక నిర్ణయాలు

2019, 2020, 2021లో జరిగిన సెలెక్షన్ బోర్డుల నిర్ణయాలు అలాగే కొనసాగుతాయి
ఆ సంవత్సరాల్లో పరిగణలోకి తీసుకున్న SSC అధికారులందరిని 20 ఏళ్ల సేవ పూర్తిచేసినట్లుగా పరిగణించాలి
వారికి పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు ఇవ్వాలి (జీత బకాయిలు మినహా)
ఈ ప్రయోజనాలు అర్హత లేనివారిగా ప్రకటించబడిన వారికి కూడా వర్తిస్తాయి
పెన్షన్‌ను 2025 నవంబర్ 1 నుండి అమలు చేయాలి
నేవీ, ఎయిర్ ఫోర్స్‌పై ఆదేశాలు
నేవీలో అర్హత ఉన్న మహిళలకు మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలి
2009 తర్వాత చేరిన మహిళలకు ఈ హక్కు వర్తిస్తుంది
ఎయిర్ ఫోర్స్‌లో సరైన అవకాశాలు ఇవ్వకుండా సేవ కాలాన్ని కారణంగా చూపి నిరాకరించడం తగదు
పారదర్శకతపై కోర్టు ఆందోళన

Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

రక్షణ శాఖ, నేవీ ఎంపిక ప్రమాణాలు మరియు మార్కులు వెల్లడించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇది పారదర్శకత లోపాన్ని చూపిస్తుందని పేర్కొంది.మహిళా అధికారులకు అన్యాయం జరగకుండా…మూల్యాంకన విధానాన్ని పూర్తిగా పునఃసమీక్షించాలని ఆదేశించారు. ACR వ్యవస్థలో మార్పులు చేయాలని … సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఈ తీర్పుతో సైన్యంలో మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో కీలక ముందడుగు పడింది.

- Advertisement -