అమెరికా–ఇరాన్ యుద్ధం ముగుస్తుందా?

5
- Advertisement -

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఏప్రిల్ 9న ముగిసే అవకాశముందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం డోనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనల తర్వాత వెలుగులోకి వచ్చింది.

ట్రంప్ ప్రకారం…అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు అనూహ్యంగా పురోగతి సాధించాయని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను మహ్మద్ బాగిర్ ఖండిస్తూ, అవి “ఫేక్ న్యూస్” అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, అమెరికా ప్రభుత్వం ఏప్రిల్ 9ను యుద్ధం ముగించే లక్ష్య తేదీగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్ మరికొద్ది రోజులపాటు యుద్ధం కొనసాగుతూనే చర్చలు జరగవచ్చని సమాచారం.

ట్రంప్, ఇరాన్‌పై ముఖ్యంగా విద్యుత్ మరియు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇక మధ్యవర్తి దేశాల ప్రయత్నాలతో ఇస్లామాబాద్‌లో అమెరికా–ఇరాన్ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ సమావేశం త్వరలోనే జరగవచ్చని సమాచారం. అయితే ఈ చర్చలపై ఇజ్రాయెల్‌కు పూర్తి వివరాలు తెలియజేయలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో, గలిబాఫ్ ఈ చర్చలపై తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

మరోవైపు, వైట్ హౌస్ అధికార ప్రతినిధి స్పందిస్తూ, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అమెరికా అధికారికంగా ప్రకటించే వరకు ఇలాంటి వార్తలను ఖరారు చేసినవిగా పరిగణించవద్దని సూచించారు. మొత్తంగా, యుద్ధం ముగింపుపై ఆశలు వ్యక్తమవుతున్నప్పటికీ, పరిస్థితి ఇంకా అనిశ్చితంగా ఉంది.

- Advertisement -