షహీద్ దివస్ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించే షహీద్ దివస్ రోజున, 1931లో బ్రిటిష్ పాలకులు ఈ ముగ్గురు విప్లవకారులను ఉరితీశిన సంఘటనను స్మరించుకుంటారు. వారి త్యాగం భారత స్వాతంత్ర్య సమరానికి శక్తివంతమైన ప్రతీకగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ…భారత్ మాత కుమారులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు మనం వినమ్రంగా నమస్కరిస్తున్నాం. దేశం కోసం చేసిన వారి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిది. చిన్న వయస్సులోనే వారు అసాధారణ ధైర్యం, అచంచలమైన దేశభక్తిని ప్రదర్శించారు. బ్రిటిష్ పాలనను ఎదిరిస్తూ, తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. వారి న్యాయం, దేశభక్తి, భయరహిత పోరాటం వంటి విలువలు నేటికీ కోట్లాది భారతీయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి అని పేర్కొన్నారు.
షహీద్ దివస్‌ను ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహిస్తారు. 1931లో ఈ ముగ్గురు విప్లవకారులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన రోజు ఇది. దేశవ్యాప్తంగా ఈ రోజు వివిధ కార్యక్రమాలు, నివాళులతో వారి త్యాగాన్ని స్మరించుకుంటారు.
1928లో Simon Commission protestsకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. లాహోర్‌లో జరిగిన ఒక నిరసనలో స్వాతంత్ర్య సమరయోధుడు Lala Lajpat Raiపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు.ఈ ఘటన భగత్ సింగ్ మరియు ఆయన సహచరులను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనికి ప్రతీకారంగా వారు బ్రిటిష్ అధికారి మీద దాడి చేయాలని యోచించారు. అయితే పొరపాటున మరో అధికారి జాన్ సాండర్స్‌ను హత్య చేశారు.
Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!
తర్వాత 1929లో, భగత్ సింగ్ …ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రతీకాత్మక బాంబు దాడి చేశారు. ఈ చర్య ప్రాణనష్టం కలిగించడానికి కాదు, బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మాత్రమే చేశారు.చివరగా, 1931 మార్చి 23న లాహోర్ జైలులో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీశారు.
వారి త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

